Share News

టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:01 PM

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టామ్‌కాంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టామ్‌కాంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు సేవలు అందజేయాలని సూచించారు.


విదేశీ ఉద్యోగాల కోసం ఒప్పందాలు..

విదేశీ ఉద్యోగాల కోసం టామ్‌కాం – మ్యాన్‌పవర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు (శుక్రవారం) మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఉపాధి, నైపుణ్యాలపై శక్తి శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


విదేశాలకు వెళ్లే కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేయాలి..

విదేశాలకు వెళ్లే కార్మికుల పూర్తి వివరాలను నమోదు చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. టామ్‌కాంకు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తామని అన్నారు. డ్రైవింగ్, విదేశీ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జర్మన్, జపనీస్, కొరియన్ సహా విదేశీ భాషలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


స్కాలర్‌షిప్‌లపై అధ్యయనం చేయాలి..

బ్లూ కాలర్ ఉద్యోగ శిక్షణార్థులకు స్కాలర్‌షిప్‌లపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. నర్సుల గ్లోబల్ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 06:46 PM