Share News

కేరళం సీఎం వీడీ సతీశన్‌కు రేవంత్‌రెడ్డి అభినందనలు

ABN , Publish Date - May 14 , 2026 | 05:58 PM

కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

కేరళం సీఎం వీడీ సతీశన్‌కు రేవంత్‌రెడ్డి అభినందనలు
CM Revanth Reddy

హైద‌రాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా విస్తృతంగా ప్ర‌చారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని వ్యాఖ్యానించారు.


విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 06:00 PM