ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. అసెంబ్లీ స్పీకర్ భావోద్వేగం
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:24 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ మనస్తాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ మనస్తాపం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం తెలిపారు.
అయితే, స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను సీఎంవో విడుదల చేసింది. ఈ క్రమంలోనే తాతా మధుపై చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సభ నుంచి తాతా మధును బహిష్కరించే యోచనలో చైర్మన్ ఉన్నారు.
స్పీకర్‌ను అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడారు: మంత్రి శ్రీధర్‌బాబు

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బీజేపీకి కూడా బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీ నేతలు సభకు సహకరించాలని కోరారు. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు అవమానించడంపై బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రూల్స్ పాటించలేదని.. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రూల్స్ పాటించట్లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News