సమ్మర్‌లో కూల్.. కూల్..
ABN , Publish Date - May 27 , 2026 | 11:02 AM
ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని నీరు గానీ, చల్లని పానీయాలు గానీ తాగాలనిపించడం సహజం. సల్సా షర్బత్, కూల్‌డ్రింక్‌లు, పండ్లరసాల దుకాణాలు కనిపిస్తే అప్రయత్నంగానే ఎక్కువ మంది కాళ్లు అక్కడ ఆగిపోతాయి.
వేసవి తాపానికి చల్లని పానీయాలు..
అందుబాటులో పండ్ల రసాలు
హైదరాబాద్: ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని నీరు గానీ, చల్లని పానీయాలు గానీ తాగాలనిపించడం సహజం. సల్సా షర్బత్, కూల్‌డ్రింక్‌లు, పండ్లరసాల దుకాణాలు కనిపిస్తే అప్రయత్నంగానే ఎక్కువ మంది కాళ్లు అక్కడ ఆగిపోతాయి. అధిక మంది పండ్ల రసాలను ఇష్టపడుతున్నారు.
చౌకగా సల్సా కూల్‌డ్రింక్స్..
సల్సా కూల్‌డ్రింక్స్(కలర్ డ్రింక్స్) ఈ మధ్యకాలంలో ఎక్కువగా బండ్లపై విక్రయిస్తున్నారు. చల్లని నీటిలో వివిధ రకాల రంగులతో కూడిన ప్లేవర్‌లను ఉపయోగించి ఈ సల్సాను తయారు చేస్తారు. నీటిలో ఐస్‌క్యూబ్స్ కూడా వేయడం వల్ల చల్లని పానీయాలు గొంతుకు తగలగానే ఎంతో హాయినిస్తాయి. లెమన్, ఆరెంజ్, గ్రీన్, తదితర ప్లేవర్‌లతో కూడిన పానీయాలు బండ్లపై అందుబాటులో ఉన్నాయి. గ్లాసుల సైజును బట్టి రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు.
ఆకర్షణీయంగా పండ్ల రసాలు
చల్లని పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు. చర్మ సౌందర్యానికి కూడా పండ్లు ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయి, క్యారెట్, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, మ్యాంగో, లెమన్, స్ర్టాబెర్రీ, గ్రీన్ మ్యాంగో, తదితరాలతోపాటు దాదాపు వంద రకాల పండ్ల రసాలు అందుబాటులో ఉన్నాయి.
కొబ్బరి నీళ్లు ప్రత్యేకం
చక్కెర పానీయాలకు బదులుగా సహజసిద్ధమైన హైడ్రేటింగ్ ఏజెంట్లకు ప్రాధాన్యతను ఇచ్చే వారు ఎక్కువగా కొబ్బరిబోండాలను తాగుతారు. ప్రతి రోజూ ఉదయం కొబ్బరి నీటితోపాటు తేనెను కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్యాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సల్సా పానీయం ప్రియులే ఎక్కువ
సల్సా పానీయం చౌకగా లభిస్తుండడం, రుచిగా ఉండడం వల్ల అధిక శాతం మంది మొగ్గు చూపుతుంటారు. నోటికి రుచిగా, కంటికి ఆకర్షణీయంగా కనబడే ఈ సల్సా పానీయాలకు ఎక్కువ మంది దాసోహం అవుతారు. కేవలం వేసవి కాలంలోనే ఈ వ్యాపారం కొనసాగుతుంది. ఇతర సీజన్‌లలో వీటి అమ్మకాలు అంతగా ఉండవు.
అస్లాం, సల్సా కూల్‌డ్రింక్ వ్యాపారి
కళ్ల ఎదురుగా తయారీ
షాపులలో లభించే థమ్సప్, స్ర్పైట్, మ్యాంగో జ్యూస్‌లను రసాయన పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. అవి ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. కూల్‌డ్రింక్‌లలో కల్తీ తయారీలు కూడా ఉంటాయి. అందుకే సల్సా, షర్బత్‌లపైనే ఎక్కువ మొగ్గుచూపుతుంటాం. వాటిని మన ఎదురుగానే శుభ్రంగా, రుచికరంగా, కంటికి ఇంపుగా తయారు చేస్తుంటారు.
అనిల్, వినియోగదారుడు
ఈ వార్తలు కూడా చదవండి:
మెట్రో సెకెండ్ ఫేజ్ కోసం పెరుగుతున్న డిమాండ్..
డిజిటల్ చెల్లింపులతో జర భద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News