మెట్రో సెకెండ్ ఫేజ్ కోసం పెరుగుతున్న డిమాండ్..
ABN , Publish Date - May 27 , 2026 | 09:55 AM
మెట్రో రెండో దశ పనులపై నగరవాసుల ఆసక్తి పెరిగింది. తొలిదశకు సంబంధించి ఎల్‌అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు పూర్తి కావడంతో త్వరితగతిన రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించాలని సిటీజనులు డిమాండ్ చేస్తున్నానరు.
డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించాలి..
నగరవాసుల విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ: మెట్రో రెండో దశ పనులపై నగరవాసుల ఆసక్తి పెరిగింది. తొలిదశకు సంబంధించి ఎల్‌అండ్‌టీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు పూర్తి కావడంతో త్వరితగతిన రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించాలని సిటీజనులు డిమాండ్ చేస్తున్నానరు. ఇతర రాష్ట్రాలో మాదిరిగానే తమకు కూడా మెట్రో రవాణాను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి ఇవ్వాల్సిన చెల్లింపులు కొలిక్కి రావడంతో అందరి చూపు రెండో దశ ప్రాజెక్టు నిర్మాణంపై పడింది. ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన రూ.13,600 కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వంపై రీఫైనాన్సింగ్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎ్‌ఫసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇరువర్గాలు సంతకాలు చేయడంతో ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఈ నేపథ్యంలో మొదటిదశ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తికానుంది.
అనుమతులివ్వాలి..
మెట్రో విస్తరణకు సంబంధించి రెండో దశలో ప్రతిపాదించిన కారిడార్లకు కేంద్ర సర్కార్ త్వరగా అనువతులు ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు. మెట్రో రవాణాను నలుదిశలా విస్తరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల దూరాన్ని ప్రతిపాదించింది. అయితే, ఈ కారిడార్లపై కేంద్రం ఇప్పటికీ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డీపీఆర్ తయారీకి ముందు ఉన్న దానితో పోలిస్తే ప్రస్తుతం ఆయా మార్గాల్లో రైడర్‌షిప్ పరిస్థితి ఏమిటీ.. మెట్రో నిర్మాణం తర్వాత ఎంతమేరకు పెరుగుతుంది.. భూ సేకరణ ఎంత వరకు చేపట్టాలి.. అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన ప్రత్యేక అధికారుల బృందంతో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమాచారాన్ని రాబట్టుకుంది. అయితే ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న ఫస్ట్‌ఫేజ్ ప్రాజెక్టు టేకోవర్ పూర్తయిన తరుణంలో 7 కారిడార్లకు ఒకేసారి అనుమతి ఇవ్వాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
జూన్ 1న బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మెట్రో రైలు నిర్వహణకు ఇటీవల 8 మంది ఐఏఎస్‌లు, 1 ఐపీఎస్‌తో ఎంఆర్‌హెచ్‌ఎల్’ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుకు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావును నియమించారు. అయితే జూన్ 1న ఎంఆర్‌హెచ్‌ఎల్ బోర్డు సభ్యులుగా నియామకమైన అధికారులు తమ బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం రెండో దశకు త్వరగా అనుమతులు ఇస్తే పనులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ ఎదురుచూస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
నేడు చర్లపల్లి-దానాపూర్ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News