హమాస్ కొత్త మిలిటరీ చీఫ్ హతం.. అక్టోబర్ 7 దాడుల సూత్రధారిపై ఇజ్రాయెల్ దాడులు..
ABN , Publish Date - May 27 , 2026 | 09:00 AM
ఇజ్రాయెల్ మరోసారి హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గాజాలో భారీ వైమానిక దాడి చేపట్టింది. హమాస్ సైనిక విభాగం కొత్త చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ మరోసారి హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గాజాలో భారీ వైమానిక దాడి చేపట్టింది. హమాస్ సైనిక విభాగం కొత్త చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఒడెహ్ (Mohammed Odeh)ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం రాత్రి చేసిన ఈ దాడిలో ఒడెహ్ ప్రాణాలు కోల్పోయారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో ఒడెహ్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఒడెహ్ నాయకత్వం వహించారు. ఇజ్రాయెల్ సరిహద్దు బలహీనతలపై సమాచారం సేకరించి, ఆ దాడి వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు. ఒడెహ్ మరణాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి కట్జ్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. అయితే ఒడెహ్ మరణంపై హమాస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు (Hamas military chief).
హమాస్ మిలిటరీ చీఫ్ అయిన ఎజ్జెదిన్ అల్ హద్దాద్‌ను కొద్ది రోజుల క్రితమే ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి (Israeli airstrike Gaza). ఆయన స్థానంలో ఒడెహ్ మిలిటరీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలోకి వచ్చిన 11 రోజుల్లోనే ఒడెహ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా, అక్టోబర్ 7 దాడుల్లో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ మారణకాండలో పాల్గొన్నవాందరినీ మట్టుబెడతామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..