గన్నవరం విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు
ABN , Publish Date - May 27 , 2026 | 06:12 AM
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ ఆందోళన రేపుతున్న నేపథ్యంలో.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య ఆరోగ్యశాఖ..
గన్నవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ ఆందోళన రేపుతున్న నేపథ్యంలో.. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎబోలా వైరస్ స్ర్కీనింగ్ పరీక్షలు చేపట్టారు. సింగపూర్ నుంచి ఇండిగో విమానంలో మంగళవారం ఉదయం 185 మంది ప్రయాణికులు వచ్చారు. వైద్య బృందం వారందరికీ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు.