డిజిటల్ చెల్లింపులతో జర భద్రం
ABN , Publish Date - May 27 , 2026 | 10:24 AM
బక్రీద్ పండుగ నేపథ్యంలో.. డిజిటల్ చెల్లింపుల (జీ పే, ఫోన్ పే, వంటివి) విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: బక్రీద్ పండుగ నేపథ్యంలో.. డిజిటల్ చెల్లింపుల (జీ పే, ఫోన్ పే, వంటివి) విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల కాంచన్‌బాగ్, రాజేంద్రనగర్ పీఎస్‌ల పరిధుల్లో రెండు డిజిటల్ మోసాలు వెలుగులోకి వచ్చాయని సీపీ తెలిపారు. కాంచన్‌బాగ్‌లో ఆరుగురు వ్యక్తులు ఒక వ్యాపారితో బేరమాడి, రూ.5వేలు చెల్లించినట్లుగా చూపించే నకిలీ యాప్ స్ర్కీన్‌ను చూపించి రూ.68వేల విలువైన పశువులతో ఉడాయించారని తెలిపారు.
అదేవిధంగా, రాజేంద్రనగర్‌లో నలుగురు వ్యక్తులు రూ.48వేల విలువైన మేకలను కొనుగోలు చేసి, నకిలీ పేమెంట్ యాప్‌తో బురిడీ కొట్టించారన్నారు. ఖాతాలో డబ్బు జమ కాలేదని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, మేకలు, గొర్రెల అమ్మకందారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అప్పగించే ముందు, మీ బ్యాంకింగ్ ఖాతాలో బ్యాలెన్స్ నిర్ధారించుకోవాలన్నారు. ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే డయల్ 100కు కాల్ చేసి పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మెట్రో సెకెండ్ ఫేజ్ కోసం పెరుగుతున్న డిమాండ్..
నేడు చర్లపల్లి-దానాపూర్ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News