Share News

రెట్రో వాకింగ్‌తో మేలు

ABN , Publish Date - May 27 , 2026 | 03:28 AM

రెట్రో వాకింగ్‌ అంటే వెనక్కి నడవడం. దీనివల్ల శారీరక, మానసిక అలసట తగ్గుతుందనీ శరీరం, మెదడుల సమన్వయం పెరుగుతుందనీ నిపుణులు చెబుతున్నారు...

రెట్రో వాకింగ్‌తో మేలు

రెట్రో వాకింగ్‌ అంటే వెనక్కి నడవడం. దీనివల్ల శారీరక, మానసిక అలసట తగ్గుతుందనీ శరీరం, మెదడుల సమన్వయం పెరుగుతుందనీ నిపుణులు చెబుతున్నారు. ఇలా రివర్స్‌ వాకింగ్‌ వల్ల కలిగే అదనపు ప్రయోజనాలేంటో చూద్దాం...

  • రెట్రో వాకింగ్‌ చేయడం వల్ల కాళ్లు బలంగా తయారవుతాయి. మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కీళ్లవాతం, మోకాళ్ల నొప్పి, తుంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.

  • వెనక్కి నడవడం, వెనక్కి పరుగెత్తడం లాంటివి మంచి కార్డియో వ్యాయామంలా పనిచేస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. అలవాటు లేని కదలికల వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి కాబట్టి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. శరీర సమతుల్యత పెరుగుతుంది.

  • వెనక్కి నడవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ట్రెడ్‌మిల్‌పై కూడా రివర్స్‌ వాకింగ్‌, జాగింగ్‌ చేయవచ్చు. దీనివల్ల దిగువ అవయవాల కండరాలు బలోపేతమవుతాయి. ముఖ్యంగా నడుం నొప్పి తగ్గుతుంది.

  • రోజూ ఉదయాన్నే పది నిమిషాలపాటు వెనక్కి నడవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముందుకు నడిచే వేగం పెరుగుతుంది. శరీరం నిటారుగా చక్కని భంగిమలోకి మారుతుంది.

  • రెట్రో వాగింగ్‌ వల్ల రోజువారీ కదలికల సరళి మారి కండరాల సమూహాలకు నూతనోత్తేజం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం

చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా

Updated Date - May 27 , 2026 | 03:28 AM