చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా
ABN , Publish Date - May 26 , 2026 | 08:08 PM
అక్రమ వలసలు, ఇతర కారణాలతో దేశంలో చోటుచేసుకుంటున్న 'అసహజ జనాభా మార్పు'పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు.
న్యూఢిల్లీ: అక్రమ వలసలు, ఇతర కారణాలతో దేశంలో చోటుచేసుకుంటున్న 'అసహజ జనాభా మార్పు' (Unnatural Demographic Change)పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి ప్రకాష్ ప్రభాకర్ నావోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారని అమిత్‌షా తెలిపారు. కమిటీ మెంబర్‌గా హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఉంటారని చెప్పారు.
దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న జనాభా మార్పులపై కమిటీ సమగ్ర మూల్యాంకనం చేసి పరిష్కారం సూచిస్తుందని అమిత్‌షా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్యం, జాతీయ భద్రత, సామాజిక సమతుల్యత, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా మారిందన్నారు. మత, సామాజిక వర్గాల స్థాయిలో జనాభా మార్పుల సరళని కమిటీ విశ్లేషిస్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం
వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్