Share News

వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్

ABN , Publish Date - May 26 , 2026 | 05:04 PM

పశ్చిమబెంగాల్‌లోని ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులపై చర్యలను సువేందు అధికారి ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి అంటూ ముఖ్యమంత్రి తాజాగా వారిని హెచ్చరించారు.

వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్
Suvendu Adhikari

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమవలసదారులపై చర్యలను సువేందు అధికారి(Suvendu Adhikari) ప్రభుత్వం ముమ్మరం చేసింది. అక్రమవలసదారులను వారి స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. 'ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే పారిపోండి' అంటూ ముఖ్యమంత్రి తాజాగా హెచ్చరించారు.


బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశంపై మాట్లాడుతూ, కొత్త చట్టంతో కాకుండా ప్రస్తుతం ఉన్న విదేశీయుల చట్టం కిందే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్షణం అక్రమవలసదారులు ఈ ప్రదేశాన్ని వదిలివెళ్లాల్సిందేనని అన్నారు. తమ పౌరులను వెనక్కి తీసుకునే బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. భారత్ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు బంగ్లాదేశ్ ఇప్పటికే చెప్పిందని తెలిపారు. బంగ్లా అక్రమ చొరబాటుదారులను జైళ్లకు పంపవద్దని తాను పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. 'వారికి మనమెందుకు ఆతిథ్యం ఇవ్వాలి? దేశ వనరులను మనం ఎందుకు దుర్వినియోగం చేయాలి. చొరబాటుదారులు ఏమైనా మన అల్లుళ్లా?' అని ప్రశ్నించారు. బంగ్లా పౌరులు స్వచ్ఛందంగా, శీఘ్రుంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


సరిహద్దు సమీపంలో బంగ్లాదేశీయలు

కాగా, అక్రమ వలసదారులను వెనక్కి పంపించేందుకు బెంగాల్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేయడంతో బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరుగుముఖం పడుతున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకింపూర్ సరిహద్దు వద్ద మంగళవారం ఉదయం పెద్దఎత్తున వారు గుమిగూడారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

స్కూళ్లు, ఆలయాల సమీపంలో మద్యం దుకాణలపై నిషేధం.. సువేందు అధికారి

అన్నాడీఎంకేలో ఆగని తిరుగుబాటు.. మరో ఎమ్మెల్యే రాజీనామా

Updated Date - May 26 , 2026 | 06:06 PM