ఫ్లాట్‌గా మొదలైన సూచీలు.. బలహీనపడిన రూపాయి..
ABN , Publish Date - May 27 , 2026 | 10:05 AM
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,009)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 75,864 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 36 పాయింట్ల నష్టంతో 23,876 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో సీజీ పవర్, స్విగ్గీ, హిందాల్కో, వెర్నోవా టీడీ, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఎల్‌ఐసీ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 255 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..