చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:53 PM
భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్: భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. 07001 నంబర్ చర్లపల్లి-తిరువణ్ణామలై ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ నెల 4 నుంచి సెప్టెంబరు 24వ తేదీ వరకు (గురువారం) చర్లపల్లిలో సాయంత్రం 5.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. అదేవిధంగా మరో మార్గంలో 07002 నంబర్ తిరువణ్ణామలై-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబరు 26వ తేదీ వరకు (శుక్రవారం) తిరువణ్ణామలైలో రాత్రి 11.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్ మీదుగా తిరువణ్ణామలై చేరుకుంటాయి. ఈ రైళ్ల రిజర్వేషన్ బుధవారం నుంచి ప్రారంభమైందని దక్షిణ రైల్వే ప్రకటనలో తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నోరూరిస్తున్న తెల్ల అల్లనేరేడు..
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News