నోరూరిస్తున్న తెల్ల అల్లనేరేడు..
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:50 PM
సాధారణంగా మనం నలుపు, ఎరుపు రంగులో ఉన్న అల్లనేరేడు కాయలను చూస్తుంటాం. అయితే నేరేడు కాయలు తెలుపు రంగులో కూడా కాస్తాయని, అవి తేనె కంటే తీపిగా ఉంటాయని కొంతమందికి మాత్రమే తెలుసు.
తంబళ్లపల్లెలో అరుదైన రకం సాగు చేసిన యువ రైతు
కిలో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయం
తంబళ్లపల్లె(తిరుపతి): సాధారణంగా మనం నలుపు, ఎరుపు రంగులో ఉన్న అల్లనేరేడు కాయలను చూస్తుంటాం. అయితే నేరేడు కాయలు తెలుపు రంగులో కూడా కాస్తాయని, అవి తేనె కంటే తీపిగా ఉంటాయని కొంతమందికి మాత్రమే తెలుసు. అన్నమయ్య జిల్లాలో ఓ యువ రైతు సాగు చేసిన తెల్ల అల్ల నేరేడు కాయల రుచికి అందరూ ఫిదా అవుతున్నారు. తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి పంచాయతి చెరువుముందర మేకలవారిపల్లెకు చెందిన కనకేశ్వరరెడ్డి బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగి.
వ్యవసాయం మీద ఉన్న మక్కువతో కొన్నాళ్ల క్రితం ఎద్దులవారిపల్లె మిట్ట వద్ద 5 ఎకరాల పొలం కొన్నాడు. మూడు ఎకరాల్లో అల్ల నేరేడు పంట సాగు చేశాడు. దాంట్లో 16 చెట్లు తెల్ల అల్లనేరేడు జాతికి చెందినవి. ఈ చెట్లు ఈ ఏడాది గుత్తులు, గుత్తులుగా విరగ్గాసాయి. లేతగా ఉన్నపుడు ఆకు పచ్చగా ఉండి పక్వ దశలోకి రాగానే తెలుపు, లేలేత పింక్ రంగులోకి వస్తాయి.
ఈ చెట్లు నాటిన మూడేళ్లకు కోతకు వచ్చినట్లు కనకేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఒక్కో చెట్టు నుంచి సుమారు 10 కేజీల వరకు దిగుబడి వస్తుందని, వయసు పెరిగే కొద్దీ దిగుబడి కూడా పెరుగుతుందన్నారు.మృదువుగా, వగరు లేకుండా తియ్యగా ఉండే ఈ కాయలను వైట్ జామూన్ అని కూడా పిలుస్తారు. స్థానిక మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News