Share News

తోతాపురికి ఈసారీ దక్కని గిట్టుబాటు ధర

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:22 PM

మామిడి రైతులకు ఈ యేడాది కూడా ధరలు ఆశాజనకంగా లేవు. మామిడితోటల్లో 70శాతానికి పైగా పండించే తోతాపురి మామిడి కాయలు విక్రయించుకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు.

తోతాపురికి ఈసారీ దక్కని గిట్టుబాటు ధర
Totapuri mangos

  • గుజ్జు పరిశ్రమల్లో టన్ను రూ.7వేలు

  • మండీలు, ర్యాంపుల్లో రూ.5వేలు

పాకాల(తిరుపతి): మామిడి రైతులకు ఈ యేడాది కూడా ధరలు ఆశాజనకంగా లేవు. మామిడితోటల్లో 70శాతానికి పైగా పండించే తోతాపురి మామిడి కాయలు విక్రయించుకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. గుజ్జు పరిశ్రమలు టన్ను రూ.7వేలతో కొనుగోళ్లు ప్రారంభించారు. దామలచెరువు మ్యాంగోనగర్‌ మండీలలో, ర్యాంపులలో వ్యాపారులు టన్ను రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలోనే తక్కువ ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తోటల్లో కోత కూలీలు, రవాణా ఖర్చులు టన్ను మామిడికాయలకు రూ.2వేలకు పైగా అవుతోంది.


mangos1.jpgయేడాదిపాటు మామిడితోటల్లో సస్యరక్షణ చేపట్టి, దుక్కులు దున్ని, కలుపులు తీసి, నీరుపారించి పండించిన మామిడికాయలకు సాగు ఖర్చుకూడా చేతినుండి పడడంతో రైతులు అప్పులు పాలవుతున్నారు.గత యేడాది తోతాపురి అమ్ముకోవడానికి ర్యాంపులు, గుజ్జుపరిశ్రమల ఎదుట రైతులు పడిగాపులు పడాల్సివచ్చింది, ప్రభుత్వం టన్ను రూ.8వేలకు కొనాలని ఆదేశాలిచ్చినా పరిశ్రమల్లో, ర్యాంపుల్లో రూ.4వేల నుంచి 5 వేల లోపే కొనుగోళ్లు జరిపారు.


vv.jpgప్రభుత్వం టన్నుకు రూ.4వేలు ప్రోత్సాహం అందించడంతో కొంత ఊరట లభించింది. ఈ యేడాది ప్రభుత్వం ఇప్పటివరకు తోతాపురి మామిడికాయల కొనుగోళ్లపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెట్లలో తోతాపురి కాయలు పక్వానికి వస్తుండడంతో ఎలా అమ్ముకోవాలో తెలియక అవస్ధలు పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏళ్లతరబడి పాతుకుపోయారు..

ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 01:23 PM