జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో పాముల సయ్యాట
ABN , Publish Date - Jun 03 , 2026 | 09:36 AM
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు.
ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం రెండు పాముల సయ్యాటతో ఉద్యోగులు ఆందోళన చెందారు. లోయర్ ట్యాంక్‌బండ్ బల్దియా ఆఫీస్‌లోని పార్కులో రెండు పాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ దాదాపు రెండు నిమిషాల పాటు పోటీపడ్డాయి. కొందరు ఉద్యోగులు, సందర్శకులు వీటిని ఆసక్తిగా తిలకించగా మరికొందరు ఆందోళన చెందుతూ ఆఫీస్‌లోకి పాములు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్కు పక్కనే నాలా ఉండడంతో అందులో నుంచి పాములు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News