బీజేపీకి అన్నామలై రాజీనామా!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:31 AM
తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆపార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్‌షలతో...
పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు ఐదు పేజీల రాజీనామా లేఖ
6 నుంచి 8 మాసాల్లో కొత్తపార్టీ
చెన్నై, జూన్ 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆపార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో్‌షలతో భేటీ అయిన అన్నామలై.. ఐదు పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. వచ్చే 6-8 నెలల్లో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలిసింది. లౌకిక, తమిళ్-ఫస్ట్ దృక్ఫథంతో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు చర్చ సాగుతోంది. తమిళ గుర్తింపును జాతీయ దృక్ఫథంతో మేళవించి.. కొత్త పార్టీకి శ్రీకారం చుట్టనున్నారని అన్నామలై అనుచరులు తెలిపారు. ఇదిలావుంటే, అన్నామలై అమిత్‌షాను మంగళవారం కలుసుకున్నారు. బీజేపీ నుంచి తాను వైదొగలటానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే అన్నామలై పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్న అమిత్‌షా.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నయినార్ ఢిల్లీకి వచ్చాక అమిత్‌షా ఆయనతో చర్చించి అన్నామలైని శాంతింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం వెనుక.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల నాథులు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే ప్రధాన కారణమని ఆయన అనుచరులు తెలిపారు. తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే పదే చెప్పారని.. కానీ, అన్నాడీఎంకేతో పొత్తుకే బీజేపీ పెద్దలు మొగ్గుచూపడంతో అన్నామలైని పక్కన పెట్టినట్టు అయిందన్నారు. అన్నామలై రాజకీయ పార్టీకంటే ముందుగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
పార్టీ ఏర్పాటుపై రేపు ప్రకటన!
పార్టీ స్థాపనపై అన్నామలై ఈ నెల 4న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది. తన నిర్ణయాన్ని వెల్లడించి, మద్దతుదారుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు సమాచారం. ‘మక్కల్ సేవై కట్చి’(ప్రజా సేవ పార్టీ) పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై రజనీకాంత్‌తో కూడా అన్నామలై చర్చించారని సమాచారం.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News