Share News

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

ABN , Publish Date - Jun 02 , 2026 | 03:02 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. తన జట్టు రెండు ట్రోఫీలను ముద్దాడటంతో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సంబరాలు అంబరాన్ని అంటాయి. తాను క్రికెట్ దిగ్గజాన్ని అనే విషయాన్ని మర్పిపోయి మరీ సంబరాలు చేసుకుంటున్నాడు.

 చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
Virat Kohli dance video

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, వారి అభిమానుల సంబరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 17 ఏళ్ల తర్వాత గతేడాది తొలిసారి ఐపీఎల్ కప్పు సాధించడం, అదే ఊపుతూ వరుసగా రెండో సారి కూడా ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో సహా మిగిలిన సభ్యులందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కింగ్ కోహ్లీ అయితే ట్రోఫీ అందుకునే సమయంలో చేసిన సందడి అంతాఇంతా కాదు. తాను సీనియర్ ప్లేయర్‌ను అనే సంగతి మర్చి మరీ.. చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తనలో ఎవ్వరూ డ్యాన్స్ ఆవహించినట్లుగా విరాట్ అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను కూడా పంచుకున్నాడు. అందులో తన సహచరుడు భువనేశ్వర్ కుమార్‌తో కలిసి విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు . జట్టు విజయోత్సవ వేడుకలో తీసిన ఈ క్లిప్‌లో ఆ ఇద్దరూ ఫ్లోర్‌పై 'కిక్లి' స్టెప్ వేస్తూ కనిపించారు. కిక్లి అనేది పంజాబ్‌కు చెందిన ఓ జానపద నృత్యం. ఈ డ్యాన్స్‌ను భువీ, విరాట్ వేస్తూ.. సహచరులను ఎంటర్ టైన్ చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు సైతం తెగ సంబరపడుతున్నారు.


క్రికెట్ దిగ్గజమైన కోహ్లీ.. ఇలా చిన్న పిల్లాడిలా మారి.. సంబరాల్లో మునిగి తేలడం.. అతడి అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇలా కోహ్లీ డ్యాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. రెండు రోజుల క్రితం తన భార్య అనుష్క శర్మతో కలిసి కూడా విరాట్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఆర్సీబీ రెండవ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కోహ్లీ చేసిన అజేయ 75 పరుగులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేయడం, తన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం పట్ల విరాట్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!

జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్

Updated Date - Jun 02 , 2026 | 03:22 PM