సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:07 PM
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు.
పశ్చిమగోదావరి జిల్లా, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో జరిగిన ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యలపై పోలీసులు విచారణ చేపట్టాలని సూచించారు. 4000 ఎస్సీ, ఎస్టీ కేసులపై ఛార్జిషీటు వేయించానని ఆయన ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. సీబీ సీఐడీకీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంచలనమైన కేసులు ఉంటే తప్ప.. 200 కేసులకు మించి తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు.
4000 కేసుల్లో ఛార్జీషీటు వేయించానని పీవీ సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రఘరామకృష్ణరాజు విమర్శించారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన పాత్ర ఉందని క్లీయర్‌గా అర్ధమైందని చెప్పారు. ఛార్జీషీట్లు వేయించడంలో ఆయనకి సంబంధం ఏమిటనే విషయంపై పోలీసులు విచారణ చేయాలని సూచించారు. భీమవరంలో జరిగిన సమావేశానికి జాన్‌మార్క్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడారని చెప్పారు. ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. వాళ్లను వేసేయాలని.. వీళ్లని వేసేయాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మంచి ప్రభుత్వం అని చెప్పి హింసను ప్రేరేపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనేది ఈ ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నానని రఘరామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందమే వేరు: సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News