పోలవరం జిల్లాలో పెద్దపులి టెన్షన్.. గజగజ వణుకుతున్న ప్రజలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 09:54 AM
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న గంగంపాలెం గ్రామం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల వైపు వస్తున్న పెద్దపులి మూగజీవాలపై వరుసగా దాడులు చేస్తోంది.
పోలవరం జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న గంగంపాలెం గ్రామం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల వైపు వస్తున్న పెద్దపులి మూగజీవాలపై వరుసగా దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 14 ఆవుదూడలు, 2 గేదెలను చంపింది. దీంతో రైతులు, పశుపోషకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.గ్రామ శివార్లలో సంచరిస్తున్న పులి పశువుల మందలపై దాడి చేస్తోంది. ముఖ్యంగా గంగంపాలెం, దండంగి, పోశమ్మగండి గ్రామాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపకూడదని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
ప్రస్తుతం పెద్దపులి దండంగి గ్రామం, పోశమ్మగండి గ్రామాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా అటవీశాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టాయి. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. పులి కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
ఈ ఘటనతో దేవీపట్నం మండలం పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఒకవైపు పశువుల నష్టం రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తుండగా, మరోవైపు ప్రజల భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పులిని త్వరగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
‘సర్’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News