తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:18 PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని తానా నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందని బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తెలిపారు. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు సహకరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడే ఈ గొప్ప కార్యక్రమానికి 40 మందికి పైగా దాతలు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా మిడ్-అట్లాంటిక్ బృందాన్ని, మిడ్ అట్లాంటిక్ రీజినల్ రిప్రజంటేటివ్ ఫణి కంతేటిని, స్వచ్ఛంద సేవకులను, దాతలను ఆయన అభినందించారు. అలాగే 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని అందుకున్న రంజిత్ కోమటిని ప్రత్యేకంగా అభినందించడం సహా ఘనంగా సత్కరించారు. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి కూడా టీమ్ సేవను ప్రత్యేకంగా ప్రశంసించారు.
మే 31న ఎక్స్‌టాన్‌లో మిడ్ అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన బ్లడ్ డ్రైవ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఈ బ్లడ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. వారిలో మొదటిసారి రక్తదానం చేస్తున్నవారు కూడా ఉన్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి ఉచితంగా వేదికను అందించిన వేణు సంగనికి, కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్‌గా స్ప్రూస్ ఇన్ఫోటెక్ వ్యవహరించింది. ప్రీమియం స్పాన్సర్‌గా టెస్లా రియాల్టీ గ్రూపు, తనిష్క్ యుఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్‌స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనెజ్మెంట్ వారణాసి కంపెనీలు వ్యవహరించాయి. ఈ కార్యక్రమంలో సురేశ్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
న్యూజెర్సీలో విజయవంతంగా తానా పికిల్‌బాల్ టోర్నమెంట్
మన ఐక్యతకు నిదర్శనం గాంధీ మెమోరియల్: జయరాం కోమటి