మన ఐక్యతకు నిదర్శనం గాంధీ మెమోరియల్: జయరాం కోమటి
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:24 AM
డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి వ్యాఖ్యానించారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి (Jayaram Komati) వ్యాఖ్యానించారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగరంలో జయరాం కోమటి పర్యటించారు. ఇర్వింగ్‌లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని ఆదివారం సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ.. పుష్కరకాలం పూర్తిచేసుకున్న గాంధీ మెమోరియల్‌ను ప్రవాస భారతీయులేగాక విదేశీ ప్రముఖులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంటి నేతలు సందర్శించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ మహత్కార్యాన్ని సాకారం చేయడంలో అహర్నిశలు శ్రమిస్తున్న మెమోరియల్ ఛైర్మన్ ప్రసాద్ తోటకూర, కార్యవర్గ బృందాన్ని జయరాం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త రామ్ గుళ్లపల్లి, పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఈ వార్తలు చదవండి
ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు నాట్స్ భారీ విరాళం
టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్
Read Latest NRI News And AP News And International News And Telugu News