తెలంగాణలో రేపటితో ముగియనున్న ‘సర్’ ప్రక్రియ
ABN , Publish Date - Aug 09 , 2026 | 08:00 PM
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ రేపటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ (Telangana SIR Process) రేపటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ చేశారు. డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. మేడ్చల్–మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం నమోదయ్యాయి.
అత్యధిక డిజిటలైజేషన్‌లో యాదాద్రి భువనగిరి 94.30 శాతంతో తొలి స్థానంలో ఉంది. మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం పూర్తి అయింది. రెండుసార్లు గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పెరగలేదు.
వార్తలు కూడా చదవండి...
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్
మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News