Share News

సింగరేణి కార్మికులకు భారీ ఊరట.. 1,135 మందికి ఉద్యోగ భద్రత

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:26 PM

సింగరేణిలో 1,135 మంది కార్మికులకు జనరల్ అసిస్టెంట్లుగా యజమాన్యం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగరేణి కార్మికులకు భారీ ఊరట.. 1,135 మందికి ఉద్యోగ భద్రత
Singareni WorkerS

హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 1,135 మంది కార్మికులకు జనరల్ అసిస్టెంట్లుగా యజమాన్యం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు క్రమబద్ధీకరణ చేస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 సెప్టెంబరు 1వ తేదీ నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. భూగర్భ కార్మికులకు 190 పనిదినాలు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పింది.


ఓపెన్ కాస్ట్, ఇతర విభాగాల కార్మికులకు 240 పనిదినాలు పూర్తి చేయాలని సింగరేణి యాజమాన్యం సూచించింది. అర్హుల జాబితాలను నవంబరు 23వ తేదీలోగా సమర్పించాలని ఏరియా జీఎంలకు ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల నుంచి మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులకు భారీ ఊరట కల్పించింది. క్రమశిక్షణతో విధులకు హాజరైతే క్రమబద్ధీకరణ, పదోన్నతులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 06:07 PM