Share News

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్ షాప్

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:33 AM

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి గేటు వద్ద బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో A1 ఫర్నిచర్ దుకాణంలో మంటలు వ్యాపించాయి.

రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..  పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్ షాప్
Rangareddy Fire Accident

రంగారెడ్డి జిల్లా, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లి గేటు వద్ద ఈరోజు (బుధవారం) అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో A1 ఫర్నిచర్ దుకాణంలో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే దుకాణమంతా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి.


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 09:01 AM