Share News

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:13 AM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. శంషాబాద్‌లోని పాలమాకుల వద్ద కల్వర్టును ఢీకొట్టి ఇన్నోవా కారు బోల్తాపడింది.

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
Shamshabad Road Accident

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. శంషాబాద్‌లోని పాలమాకుల వద్ద కల్వర్టును ఢీకొట్టి ఇన్నోవా కారు బోల్తాపడింది. ప్రమాద ధాటికి ఇన్నోవా నుజ్జునుజ్జయింది. స్పాట్‌లోనే నలుగురు మృతిచెందారు. సమాచారం అందగానే శంషాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటనలో మృతిచెందిన వారంత ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చౌడూర్ గ్రామానికి చెందిన వారని.. వీరిలో కేతవత్ లింబ్య, జమున, కత్రొవత్ మానసింగ్, కేతవత్ వాస్రామ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మెట్టుగడ్డ తండాలో జరిగిన గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్నారు. అనంతరం శంషాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అశోక్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉస్మానియా మార్చురీకి మృతదేహాలను పంపించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన సీఎం

కేసీఆర్ ఫాంహౌస్ భూములపై మా దగ్గర ఆధారాలు.. సమాధానం చెప్పాల్సిందే: పొంగులేటి

ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 07:30 AM