ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 10:40 AM
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ సమీపంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్, మార్చి22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ సమీపంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాయత్ సాగర్ వద్ద ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీని.. కారు అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ధీరజ్ నాయుడు అనే యువకుడు మృతిచెందారు. ఆయన చనిపోవడంతో కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనకు కారణమిదే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డుపై హిమాయత్ సాగర్ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉన్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోవడంతో, కారులో ప్రయాణిస్తున్న ధీరజ్ నాయుడు అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్
మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News