Share News

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:38 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు
special trains

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 08517 ప్రత్యేక రైలు ఈ నెల 22, 25 తేదీల్లో మధ్యాహ్నం 3.50గంటలకు విశాఖపట్నం నుంచి, 08518 ప్రత్యేకరైలు ఈ నెల 23, 25 తేదీల్లో రాత్రి 8గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. అలాగే, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి గురువారం రాత్రి 8గంటలకు 07424 ప్రత్యేక రైలు బయల్దేరుతుందని ఆయన పేర్కొన్నారు.


city3.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు.. రెండు రోజుల్లో 1.69 లక్షల మంది దర్శనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 09:38 AM