Share News

నేటి నుంచి 24 వరకు సంజీవయ్య పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 09:09 AM

ఈ నెల 21 నుంచి 24 వరకు హైదరాబాద్‏లోని ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి 24 వరకు సంజీవయ్య పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Hyderabad Traffic Restrictions

హైదరాబాద్‌ సిటీ: దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం పీపుల్స్‌ ప్లాజా, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌, సంజీవయ్య పార్క్‌ పరిసరాల్లో అధికారులు బేబీపాండ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

  • పంజాగుట్ట, రాజ్‌భవన్‌ వైపు నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి నిరంకారి జంక్షన్‌ వైపునకు పంపుతారు.

  • నిరంకారి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ నుంచి రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్‌ వైపు పంపుతారు. (ఇక్బాల్‌ మినార్‌ వైపు కేవలం అమ్మవారి విగ్రహాల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు).


  • ఇక్బాల్‌ మినార్‌ నుంచి సెక్రటేరియట్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ మీదుగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ లేన్‌/మింట్‌ కాంపౌండ్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ప్రింటింగ్‌ ప్రెస్‌ జంక్షన్‌ వద్ద మింట్‌ కాంపౌండ్‌/రాజీవ్‌ గాంధీ విగ్రహం వైపు మళ్లిస్తారు.

  • అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి సెక్రటేరియట్‌ జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేడ్కర్‌ విగ్రహం వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి సెక్రటేరియట్‌ జంక్షన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ వైపు మళ్లిస్తారు


  • అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, నల్లగుట్ట బ్రిడ్జి నుంచి పీవీమార్గ్‌కు వచ్చే వాహనాలను సోనాబీ అబ్దుల్లా మసీదు వద్ద మినిస్టర్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. రాణిగంజ్‌, మినిస్టర్‌ రోడ్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్‌రోడ్‌ నుంచి మినిస్టర్‌ రోడ్‌ రాణిగంజ్‌ వైపు పంపుతారు. ఈ రూట్‌లో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని జాయింట్‌ సీపీ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు.. రెండు రోజుల్లో 1.69 లక్షల మంది దర్శనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 09:09 AM