తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు.. రెండు రోజుల్లో 1.69 లక్షల మంది దర్శనం
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:42 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 17 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. ఇక, సోమ, మంగళవారాల్లో రూ.6.19 కోట్ల హుండీ ఆదాయం రాగా, సోమ, మంగళవారాల్లో 1.69 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఈ రెండురోజుల్లో 42,357 మంది తలనీలాలు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అభ్యర్థుల తుది జాబితా 25 వరకు ఆపండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News