కోహ్లీ, రోహిత్ 2027 ప్రపంచకప్ ఆడటంపై బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 08:34 AM
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడాలా వద్దా అనే నిర్ణయానికి వారి వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణికం కాదని ఆయన స్పష్టం చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెరీర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు సీనియర్లు ఆడాలా వద్దా అనే నిర్ణయానికి వారి వయసు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదిక కాదని ఆయన స్పష్టం చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడుతారా లేదా అని జరుగుతున్న చర్చలకు ఆయన తెరదించారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్, అద్భుతమైన ప్రదర్శనే సెలక్షన్‌కు గీటురాయని పేర్కొన్నారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలిపించే సత్తా, ఫిట్‌నెస్ ఉన్నంత కాలం వారు ఆడవచ్చని తేల్చిచెప్పారు.
వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, గత నెలలో వెస్టిండీస్‌పై 139 పరుగులతో సాధించాడు. విరాట్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 307 పరుగులు చేశాడు. అలానే రోహిత్ తన ఫామ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌పై 138 పరుగులతో సహా రెండు శతకాలు సాధించాడు. రోహిత్ ఆడిన చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 389 పరుగులు సాధించాడు. ఈ గణాకాలు వారి ప్రదర్శనకు నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బీసీసీఐ చీఫ్ కూడా వీటి పరిగణలోకి తీసుకునే... పై వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వానికి సంబంధించి కూడా బీసీసీఐ చీఫ్ మిథున్ ప్రస్తావించారు. గిల్ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడంలో విరాట్, రోహిత్ వంటి సీనియర్ల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని మన్హాస్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు, భారత్‌కు గిల్ నాయకత్వం వహించిన అనుభవం ప్రపంచకప్ ప్రచారంలో అతనికి ప్రతికూలంగా నిలుస్తుందన్నారు. జట్టులో విరాట్, రోహిత్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు ఉండటం గిల్‌కు పెద్ద బలంగా మారుతుందని మిథున్ అభిప్రాయపడ్డారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తూ జట్టు భారాన్ని పంచుకోగలడని తెలిపారు. ఏది ఏమైనా, ప్రశాంత స్వభావం గల గిల్‌కు సీనియర్ల సాన్నిహిత్యం అదనపు ప్రయోజనమని మిథున్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
కివీస్‌ను భయపెడుతున్న వైభవ్.. శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డబ్ల్యూటీసీ చరిత్రలో దక్షిణాఫ్రికా సంచలనం.. ఆసీస్‌కు తొలిసారి ఫాలో ఆన్!