Share News

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

ABN , Publish Date - Oct 22 , 2026 | 08:10 AM

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొన్నారు. సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
TTD Tirumala Temple

తిరుపతి జిల్లా: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొన్నారు. సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని వెల్లడించారు.


కాగా, నిన్న (బుధవారం) శ్రీవారిని మొత్తం 73,226 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు 24,754 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.66 కోట్ల ఆదాయం లభించింది. ఇక, సోమ, మంగళవారాల్లో 1.69 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో 42,357 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే, హుండీ ద్వారా స్వామివారికి రూ. 6.19 కోట్ల ఆదాయం లభించింది.


ఈ వార్తలు కూడా చదవండి

దేశీయ పర్యాటకంలో తీర్థయాత్రలదే

నేటి రాశి ఫలాలు... 22-10-026

Updated Date - Oct 22 , 2026 | 08:11 AM