Share News

దేశీయ పర్యాటకంలో తీర్థయాత్రలదే అగ్రస్థానం

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:02 PM

సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో కుటుంబసమేతంగా యాత్రలకు వెళ్లడం ఏడాదికేడాది పెరుగుతోంది. కొందరు ఉల్లాసం కోసం, మరికొందరు ఆరోగ్యం కోసం వెళ్తున్నప్పటికీ... అధికశాతం తీర్థయాత్రలకు ఓటేస్తున్నట్టు ఇటీవల ఓ సర్వేలో తేలింది.

దేశీయ పర్యాటకంలో తీర్థయాత్రలదే అగ్రస్థానం
Tourist Hotspot

  • తీర్థయాత్రలకే ఓటు

సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో కుటుంబసమేతంగా యాత్రలకు వెళ్లడం ఏడాదికేడాది పెరుగుతోంది. కొందరు ఉల్లాసం కోసం, మరికొందరు ఆరోగ్యం కోసం వెళ్తున్నప్పటికీ... అధికశాతం తీర్థయాత్రలకు ఓటేస్తున్నట్టు ఇటీవల ఓ సర్వేలో తేలింది. భారతీయ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసిన డొమెస్టిక్‌ టూరిజం ఎక్స్‌పెండీచర్‌ సర్వే (డీటీఈఎస్‌) ప్రకారం 48 శాతం తీర్థయాత్రలు చేస్తున్నట్టు తేలింది. ఆ ఆసక్తికర విశేషాలివి...


  • తీర్థయాత్రల నుంచి షాపింగ్‌, ఆరోగ్యం... ఇలా దేశీయంగా చేసే రాత్రి బసతో కూడిన ప్రయాణాలలో తీర్థయాత్రలకే 48 శాతం కేటాయిస్తున్నారు.

  • గ్రామీణవాసులు చేస్తున్న ఆరోగ్య, వైద్య సంబంధిత ప్రయాణాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ తరహా ప్రయాణాల వాటా 38.4 శాతంగా తేలింది. అదే నగర, పట్టణవాసులు 36.4 శాతంతో వినోదం, విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నారు.


  • దేశీయ పర్యటనలు సాధారణంగా తక్కువ వ్యవధిలో ఉంటాయని సర్వేలో తేలింది. అది కూడా సగటున రెండు రోజులు మాత్రమే. సుమారు 80 శాతం మంది ఐదు రోజులు అంతకన్నా తక్కువ కాలం మాత్రమే బస చేస్తున్నారు.

  • ప్రయాణాల ప్రాధాన్యతల విషయానికొస్తే... గ్రామీణులు బస్సులను (32 శాతం) సాధారణ రవాణా సౌకర్యంగా వాడుతున్నారు. పట్టణ ప్రాంతవాసులు రైళ్లను (35 శాతం) ఆశ్రయిస్తున్నారు.


book9.2.jpg

  • పట్టణ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లలో విడిది చేస్తున్నారు. వీటి వాటా 36 శాతంగా ఉంది. అదే గ్రామీణులు తాత్కాలిక వసతి, స్వచ్ఛంద, ఉచిత వసతుల్లో ఉంటున్నారు.

  • అత్యధికులు సందర్శిస్తున్న రాష్ట్రాలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రానికి చెందినవారు, బయటి నుంచి వస్తున్న ప్రయాణీకులను చూస్తే మొత్తం సందర్శనలో


ఈ రాష్ట్రం వాటా 15.7 శాతం. తర్వాతి స్థానాలలో తమిళనాడు (13.4 శాతం), రాజస్థాన్‌ (8 శాతం) ఉన్నాయి.

  • అన్ని ప్రయాణాలకు ఒకేవిధంగా

ఖర్చు అవ్వదు. వీటిలో ఆరోగ్యం, వైద్యం కోసం చేసే ప్రయాణాలు ఖరీదైనవిగా తేలాయి. ఇటువంటి ప్రయాణాలకు సగటున రూ. 29 వేలు (గ్రామీణం), రూ. 41 వేలు (పట్టణం) ఖర్చు అవుతోంది.

  • వినోదం, విశ్రాంతి

కోసం చేసే యాత్రల్లో రవాణాకే అత్యధికంగా ఖర్చు అవుతున్నట్లు లెక్క తేల్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 01:02 PM