Share News

ఐదో స్థానంలో ఆడటం అంత ఈజీ కాదు: తిలక్ వర్మ

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:13 PM

టీ20 మ్యాచుల్లో ఐదు, లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం కొంచెం కష్టమేనని భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ్ అన్నాడు.

ఐదో స్థానంలో ఆడటం అంత ఈజీ కాదు: తిలక్ వర్మ
Tilak Varma

ఇంటర్నెట్ డెస్క్: టీ20 మ్యాచుల్లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం కొంచెం కష్టమేనని భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ్ అన్నాడు. అయితే, ఈ బాధ్యతకు ఇప్పటికే తాను మానసికంగా నైపుణ్యాల పరంగా సిద్ధమయ్యానని చెప్పాడు. నెం.5 పొజిషన్‌లో రాణిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పాడు.

‘నెం.3 పొజిషన్ నుంచి నెం.5 లేదా నెం.6కు మారడం అంత ఈజీ కాదు. సవాళ్లు ఉంటాయి. కానీ నేను వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నాను. చివర్లో వచ్చి ఆటను గొప్పగా ముగించడం నాకు ఇష్టమే’ అని శనివారం వెస్టిండీస్‌తో మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ చెప్పాడు.


‘ఓ వ్యక్తిగా నాకు నెం.3 పొజిషన్ బెటర్. కానీ టాప్ కాంబినేషన్ ఇప్పటికే సెట్ అయ్యింది. కాబట్టి, నేను నెం.5 లేదా నెం.6 స్థానంలో ఆడాలి. నెం.3 స్థానంలో కిషన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి నాకు నెం.5 లేదా నెం.6 తప్ప మరో ఆప్షన్ లేదు. కాబట్టి నేను ఈ బాధ్యతలకు మానసికంగా సిద్ధంగా ఉన్నాను. మీరు నా గత మ్యాచ్‌లను చూస్తే నేను విజయం సాధించినట్టు అర్థం అవుతుంది. కాబట్టి మంచి ఆటతీరు కనబరుస్తానన్న నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు. షాట్స్ రేంజ్‌ను, నైపుణ్యాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని అతడు చెప్పాడు. లేకపోతే క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని చెప్పాడు.


వాస్తవానికి తాను గతంలో కూడా ఈ పొజిషన్‌లో ఆడానని తిలక్ వర్మ అన్నాడు. ఏ స్థానంలోనైనా ఆడగలనన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. నెం.6గా ఆడిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ 195 స్ట్రైక్ రేట్‌ను సాధించాడు. నెం.6, నెం.5 స్థానాల్లో పర్ఫార్మెన్స్‌ను కలిపితే అతడి యావరేజ్ 46గా, స్ట్రైక్ రేట 158గా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

సీఎస్‌కే, కేకేఆర్ కాదు.. హార్దిక్ పాండ్యా ఆ జట్టులోకి వెళ్లొచ్చు: అశ్విన్

డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్‌ వేలం

Updated Date - Oct 18 , 2026 | 12:19 PM