Share News

సీఎస్‌కే, కేకేఆర్ కాదు.. హార్దిక్ పాండ్యా ఆ జట్టులోకి వెళ్లొచ్చు: అశ్విన్

ABN , Publish Date - Oct 18 , 2026 | 08:40 AM

ఐపీఎల్‌-2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మార్పుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సీఎస్‌కే, కేకేఆర్ కాదు.. హార్దిక్ పాండ్యా ఆ జట్టులోకి వెళ్లొచ్చు: అశ్విన్
Hardik Pandya

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2027 సీజన్‌కు ముందు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మార్పుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు (Hardik Pandya Trade IPL 2027).


హార్దిక్, రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోకి వెళ్లే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 'హార్దిక్ పాండ్యాను సీఎస్‌కేలోకి తీసుకొచ్చేందుకు ఎంఎస్ ధోనీ స్వయంగా ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. హార్దిక్ వంటి ఆల్‌రౌండర్ జట్టులోకి వస్తే సీఎస్‌కేకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అయితే హార్దిక్ సీఎస్‌కేకు మారే అవకాశం తక్కువ. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, హార్దిక్ ట్రేడ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ ముందంజలో ఉంది' అని అశ్విన్ పేర్కొన్నాడు (Ashwin about Hardik Pandya).


హార్దిక్ పాండ్యాను తీసుకోవడానికి పలు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి (IPL Trade News). సీఎస్‌కేతో పాటు కేకేఆర్ పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్‌ను ఏ జట్టు తీసుకుంటుందనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక ఆటగాడి ట్రేడ్ ఖరారు కావాలంటే సంబంధిత ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం కుదరాలి. మరి, 2027లో హార్దిక్ ఏ జట్టుకు ఆడుతాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..

Updated Date - Oct 18 , 2026 | 08:47 AM