జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

ABN, Publish Date - Oct 17 , 2026 | 04:33 PM

జగన్ ఆదేశాల మేరకే వైసీపీ శ్రేణులు పులివెందులలో అరాచకం సృష్టిస్తున్నాయని టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఏదో రకంగా ఎన్నికలను ఆపాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఇంతలా బరితెగిస్తోందని మండిపడుతున్నారు.

ఉమ్మడి కడప జిల్లా, అక్టోబర్ 17: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్‌లు ప్రారంభమైన వేళ.. వైసీపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. నామినేషన్ కేంద్రానికి రాళ్లు, కర్రలు, కారంపొడితో రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. పులివెందులలో సంఖ్యాబలాన్ని చూసుకుని వైసీపీ అహింసను ప్రోత్సహిస్తోందని టీడీపీనేతలు మండిపడుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

Updated at - Oct 17 , 2026 | 04:40 PM