ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ కదలికలపై నిఘా పెట్టాలి: ఎంపీ సానా సతీశ్
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:20 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తీరుపై టీడీపీ ఎంపీ సానా సతీశ్ మండిపడ్డారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలతోనే రాయలసీమలో గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కాకినాడ, అక్టోబర్ 18: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తీరుపై టీడీపీ ఎంపీ సానా సతీశ్ మండిపడ్డారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలతోనే రాయలసీమలో గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు హాని చేయడానికి కిరాయి హంతకులను మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకువస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు చేస్తున్న అరాచకాలతో దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువు పోతోందని విమర్శించారు.
మరోవైపు పుంగనూరులో కార్లతో ప్రజలను తొక్కించిన అరాచకాలపై జగన్ ఏం సమాధానం చెబుతారని ఎంపీ సానా సతీశ్ ప్రశ్నించారు. ఈ ఘటనల గురించి గవర్నర్కు వివరిస్తారా అంటూ నిలదీశారు. పులివెందులలో మిథున్ రెడ్డి అల్లర్లు సృష్టిస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ కదిలికలపైనా నిఘా పెట్టాలని కోరారు.
ఈ వార్తలూ చదవండి
పుంగనూరు దాడులు.. మిథున్రెడ్డిపై కేసులు
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు.. పుంగనూరుకు రావొద్దని ఆదేశం