మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు.. పుంగనూరుకు రావొద్దని ఆదేశం
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:44 AM
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అన్నమయ్య జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అన్నమయ్య జిల్లా, అక్టోబర్ 18: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈరోజు (ఆదివారం) అన్నమయ్య జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పుంగనూరుకు రాకూడదంటూ ఆయనకు నోటీసులు పంపించారు. పుంగనూరు మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అక్కడ అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఇప్పటివరకు 250కి పైగా కేసులు నమోదయ్యాయి.
కాగా పుంగనూరులో ఆఖరి రోజు నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఆరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నోటీసులు అందజేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలూ చదవండి
పుంగనూరు దాడులు.. మిథున్రెడ్డిపై కేసులు
వైసీపీ నాయకురాలికి జనసేన టికెట్