Share News

పుంగనూరు దాడులు.. మిథున్‌రెడ్డిపై కేసులు

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:49 AM

పుంగనూరు నామినేషన్‌ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన దాడులు, బీభత్సానికి సంబంధించి నాలుగు కేసుల్లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఏ1గా పోలీసులు నమోదు చేశారు.

పుంగనూరు దాడులు.. మిథున్‌రెడ్డిపై కేసులు

పుంగనూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నామినేషన్‌ కేంద్రం వద్ద శుక్రవారం జరిగిన దాడులు, బీభత్సానికి సంబంధించి నాలుగు కేసుల్లో రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఏ1గా పోలీసులు నమోదు చేశారు. పుంగనూరు టీడీపీ నాయకులు ఎస్‌.మధుసూదన్‌రాయల్‌, సయ్యద్‌ సుహేల్‌బాషా, జంపాల మోహన్‌నాయుడు, మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వచ్చి దాడులకు దిగి గాయపరిచారని, విధులకు ఆటంకం కలిగించారని, వాహనాలతో దూసుకొచ్చారని.. పలు అభియోగాలపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:49 AM