వైసీపీ నాయకురాలికి జనసేన టికెట్
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:28 AM
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీకి చెందిన గొర్లె విజయకుమారికి జనసేన. మున్సిపల్ చైర్పర్సన్ టికెట్ ఇవ్వడంపై కూటమిలో అసంతృప్తి చెలరేగింది.
ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఈ పార్టీలో సీటు
సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా గొర్లె విజయకుమారి
కూటమిలో చెలరేగిన అసంతృప్తి
సహకరించేది లేదంటున్న తెలుగు తమ్ముళ్లు
రాజీనామా చేస్తామంటున్న జనసైనికులు
పార్వతీపురం/సాలూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రాజకీయం వేడెక్కింది. వైసీపీకి చెందిన గొర్లె విజయకుమారికి జనసేన. మున్సిపల్ చైర్పర్సన్ టికెట్ ఇవ్వడంపై కూటమిలో అసంతృప్తి చెలరేగింది. వైసీపీకి రాజీనామా చేయకుండానే ఆమెకుటికెట్ కేటాయించడంపై టీడీపీ, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి. తాము సహకరించేది లేదని తెలుగు తమ్ముళ్లు చెబుతుండగా, మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయకుమారి సాలూరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. 2023 తర్వాత ఆమె భర్తతో కలిసి వైసీపీలో చేరారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మరొకరికి టికెట్ కేటాయించడంతో ఆమె అనూహ్యంగా జనసేన తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా టికెట్ పొందారు. వైసీపీకి రాజీనామా చేయకుండా.. జనసేన పార్టీ సభ్యత్వం పొందకుండానే ఆమె జనసేన అభ్యర్థిగా టికెట్ పొందడంపై జనసేన, టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
‘శుక్రవారం సాలూరు వచ్చిన ఎమ్మెల్సీ నాగబాబు.. మున్సిపాలిటీలో 32 కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు వేయాలని చెప్పారు. ఇప్పుడేమో మమ్మల్ని సంప్రదించకుండానే వైసీపీకి చెందిన విజయకుమారిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఎంతవరకు సమంజసం. అధిష్ఠానం తీరు మార్చుకోకపోతే రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని స్థానిక జనసేన నాయకులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ