Share News

ఆయుష్‌లో లైంగిక వేధింపులపై మెజిస్టీరియల్‌ విచారణ

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:26 AM

ఆయుష్‌ విభాగంలో అధికారిణిని విశాఖపట్నం ఆయుష్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లైంగికంగా వేధించారని అందిన ఫిర్యాదుపై ఆయుష్‌ డైరెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు.

ఆయుష్‌లో లైంగిక వేధింపులపై మెజిస్టీరియల్‌ విచారణ

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆయుష్‌ విభాగంలో అధికారిణిని విశాఖపట్నం ఆయుష్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లైంగికంగా వేధించారని అందిన ఫిర్యాదుపై ఆయుష్‌ డైరెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. ఈ నెల 13న అధికారిక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆ అధికారిణి తప్పనిసరి స్థితిలో ఆర్‌డీడీ కారు ఎక్కారు. ఆయన మార్గమధ్యంలో అభ్యంతరకరంగా ప్రవర్తించారు.

దీనిపై ఆమె ఆయుష్‌ విభాగం ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషన్‌కు, మహిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్‌డీడీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో మరో మహిళకు ఇలా జరగకూడదని కోరారు. ఈ ఘటనను ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించడంతో ఆయుష్‌ డైరెక్టర్‌ అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:26 AM