Share News

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:47 AM

రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌డిమాండ్‌ చేశారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్‌

అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని శనివారం ఎక్స్‌వేదికగా పోస్టు చేశారు. గడచిన రెండు రోజులుగా వైసీపీ అభ్యర్థులను స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వడం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను ముఖ్యమంత్రి ఛిద్రం చేస్తున్నారని, కూటమి నేతలు హింసకు పాల్పడేందుకు లైసెన్సు ఇచ్చేశారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లేందుకు తమ పార్టీ ఎంపీలను కూడా అనుమతించడం లేదన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:47 AM