Share News

పక్కపక్కనే వైరివర్గీయులు!

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:56 AM

రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఎంత వైరం.. వైరుధ్యపోకడలు ఉన్నప్పటికీ.. నామినేషన్ల ఘట్టంలో ఇలా పక్కపక్కన కూర్చోవడం.. ఆలింగనాలు చేసుకోవడం ఒకింత ఆశ్చర్యమే!

పక్కపక్కనే వైరివర్గీయులు!

  • టీడీపీ, వైసీపీ అభ్యర్థుల పరస్పర ఆలింగనాలు.. ఆల్‌ ది బెస్ట్‌లూ..

  • మదనపల్లె నామినేషన్ల ఘట్టంలో ఆసక్తికర సన్నివేశం

మదనపల్లె, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఎంత వైరం.. వైరుధ్యపోకడలు ఉన్నప్పటికీ.. నామినేషన్ల ఘట్టంలో ఇలా పక్కపక్కన కూర్చోవడం.. ఆలింగనాలు చేసుకోవడం ఒకింత ఆశ్చర్యమే! అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శనివారం భిన్నమైన రాజకీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం మదనపల్లె మున్సిపాలిటీ టీడీపీ, వైపీపీ చైర్మన్‌ అభ్యర్థులు శ్రీరామ్‌ చినబాబు, జింకా వెంకటాచలపతి పక్కపక్కనే కూర్చొని ఒకేసారి నామినేషన్లు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పరస్పరం ఆల్‌ది బెస్ట్‌ చెప్పుకుని ఆలింగనం చేసుకున్నారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూద్దామని నిర్ణయించుకోవడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:57 AM