ఇంత సిగ్గు లేని రాజకీయాలను ఇంకెంత కాలం భరించాలి: విజయసాయిరెడ్డి
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:24 AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ'తో కాంగ్రెస్ కలిసి పని చేస్తోందంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ'తో కాంగ్రెస్ కలిసి పని చేస్తోందంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేశారు. రాజకీయ పొత్తులు, వివిధ పార్టీల మద్దతు విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు (Vijayasai Reddy).
'కాంగ్రెస్ ఏర్పాటు చేసిన 'ఇండియా' కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా ఉన్నాయి. అలాగే కాక్రోచ్ జనతా పార్టీతో కలిసి కాంగ్రెస్ పని చేస్తోంది. ఆ కాక్రోచ్ పార్టీకి వైఎస్సార్సీపీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. సీపీఐ కూడా వైఎస్సార్సీపీతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చూడటమే తన ఏకైక లక్ష్యమని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ప్రతిజ్ఞ చేశారని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా రెడ్డి పారిశ్రామికవేత్తలను ఏబీ వెంకటేశ్వరరావు లక్ష్యంగా చేసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
మరో ఐదేళ్లలో అంతరిక్ష యుద్ధం.. ఉపగ్రహాలపై దాడులకు అగ్రరాజ్యాల సన్నాహాలు..