Share News

వంటలు: చైనీస్‌ భేల్‌.. ఇలా చేస్తే ఆ రుచే వేరు..

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:14 PM

చైనీస్‌ భేల్‌ తయారీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడుల్స్‌ - రెండు కప్పులు, ఉల్లికాడ ముక్కలు - అరకప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు.

వంటలు: చైనీస్‌ భేల్‌.. ఇలా చేస్తే ఆ రుచే వేరు..
Vantalu

కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడుల్స్‌ - రెండు కప్పులు, ఉల్లికాడ ముక్కలు - అరకప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు - అర కప్పు, క్యాబేజీ, క్యారెట్‌, టమాటా ముక్కలు - కప్పు,అల్లం, వెల్లుల్లి ముక్కలు - స్పూను, వెనిగర్‌ - స్పూను, చిల్లీ సాస్‌ - స్పూను, సోయా సాస్‌ - స్పూను, సెజ్‌వాన్‌ సాస్‌ - స్పూను,టమాటా కెచప్‌ - స్పూను, నూనె - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత.


book8.2.jpgతయారుచేసే విధానం: చల్లారిన నూడుల్స్‌ను నూనెలో వేయించి పక్కనపెట్టాలి. అదనపు నూనెను తొలిగించాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేయించాలి. కాస్త ఘుమఘుమలాడుతుంటే, క్యారెట్‌, క్యాబేజీ, క్యాప్సికమ్‌, ఉల్లికాడ ముక్కల్ని జతచేయాలి. రెండు నిమిషాల తరవాత అన్ని సాస్‌లనూ చేర్చాలి. వేయించిన నూడుల్స్‌ను చేత్తో ముక్కలుగా చేసి ఇందులో వేయాలి. టమాటా ముక్కలు, ఉప్పు కూడా జతచేసి ఓ రెండు నిమిషాలు వేయించి స్టవ్‌ కట్టేస్తే వేడి వేడి చైనీస్‌ భేల్‌ తయారు. స్నాక్‌గా బాగుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 12:14 PM