వంటలు: మునగాకు పరాటా.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:46 AM
మునగాకు పరాటా.. తయారీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు, మునగాకు - ముప్పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు - అర కప్పు.
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు, మునగాకు - ముప్పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు - అర కప్పు, కొత్తిమీర తరుగు - అర కప్పు, పచ్చి మిర్చి - ఒకటి, అల్లం, వెల్లుల్లి ముక్కలు - స్పూను, కారం - స్పూను, పసుపు - అర స్పూను, చాట్ మసాలా - పావు స్పూను, ధనియాల పొడి - అర స్పూను, నీళ్లు, నెయ్యి - తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో పిండితో పాటు అన్ని పదార్థాలను వేసి, కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లను చేర్చి చపాతీ పిండిలా చేసి, పావు గంట పాటు మూతపెట్టాలి. ఆ తరవాత చిన్న ముద్దను తీసుకుని పరాటాలా వత్తుకుని పెనం మీద నెయ్యి వేసి అటూ ఇటూ కాలిస్తే మునగాకు పరాటా తయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు
Read Latest AP News And Telangana News And International News And Telugu News