ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:25 AM
నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. హైదరాబాద్ శివారులోని నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన డాండియా వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ దీపాలతో అలంకరించిన భారీ ఆర్చ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మృతి చెందగా.. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. మృతురాలి సోదరి మీనా కూడా ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం.
పోలీసుల బందోబస్తు.. దర్యాప్తు ప్రారంభం..
ప్రమాద నేపథ్యంలో ఎంవీఎస్ఆర్ కాలేజీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. ఘటనాస్థలికి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వేడుకల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్కు అప్పగించినట్లు తెలుస్తోంది. భారీ ఆర్చ్ ఏర్పాటులో భద్రతా ప్రమాణాలు పాటించారా, తగిన అనుమతులు తీసుకున్నారా అనే కోణంలో ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఈవెంట్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం, యాజమాన్యం మరియు నిర్వాహకుల నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతోంది.
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక