Share News

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం..

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:53 AM

ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక మహారాష్ట్ర రైతులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీరికి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు.

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం..
Maharashtra drought

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్‌నినో కరవు పంజా విసురుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి నెలకొంది. అటు తాగునీటికి, ఇటు సాగునీటికి కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి మహారాష్ట్రలో మరింత దారుణంగా ఉంది. వర్షాలు లేక అక్కడి రైతులు అల్లాడుతున్నారు. తీవ్ర నీటి కొరతతో అనేకానేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రైతులకు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. అక్టోబర్ నెలలో ఒకరోజు శాలరీని అన్నదాతల సహాయార్థం సీఎం రీలిఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారికంగా లేఖ రాశారు.


మరోవైపు మహారాష్ట్రలో తీవ్ర కరవు పరిస్థితులు రాబోతున్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నెల 14న అత్యంత కరవు ప్రభావిత ప్రాంతాలుగా 305 మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో రైతులకు పలు సహాయాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి పన్ను మినహాయింపులు కల్పించింది. అలాగే రైతుల నుంచి రుణ వసూళ్లను నిలిపివేసింది. విద్యుత్ ఛార్జీల్లో రాయితీలూ ఇచ్చింది. కరవు పరిస్థితుల్లో గడ్డుకాలం ఎదుర్కొంటున్న అన్నదాతల సంక్షేమం కోసం సంగమేశ్వర్ ఎమ్మెల్యే శేఖర్ నికమ్ తన నెలరోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చారు.


ఈ వార్తలూ చదవండి

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

Updated Date - Oct 17 , 2026 | 12:36 PM