Share News

అయ్యర్‌కు కివీస్‌ సవాల్‌

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:27 AM

న్యూజిలాండ్‌ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌ల్లో అజేయంగా నిలిచిన భారత్‌కు ఇప్పుడు అసలుసిసలు సవాల్‌ ఎదురుకానుంది. కివీస్‌తో ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా...

అయ్యర్‌కు కివీస్‌ సవాల్‌

మ. 12.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

కివీస్ x భారత్‌ తొలి టీ20 నేడు

అందరి దృష్టీ భువీపైనే

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌ల్లో అజేయంగా నిలిచిన భారత్‌కు ఇప్పుడు అసలుసిసలు సవాల్‌ ఎదురుకానుంది. కివీస్‌తో ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. వెస్టిండీ్‌సతో సిరీస్‌ ముగిసిన వెంటనే కివీస్‌ పర్యటనకు బయల్దేరినందున శ్రేయాస్‌ అయ్యర్‌సేన ప్రయాణ బడలికతోపాటు ఇక్కడి వాతావరణానికి వెంటనే అలవాటు పడేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు టీమిండియా ఒక్కరోజు మాత్రమే ప్రాక్టీస్‌ చేసింది. న్యూజిలాండ్‌లో గాలి వేగం కారణంగా బంతి ఎక్కువగా స్వింగ్‌ అయ్యే అవకాశం ఉంది. అనుభవం లేని బ్యాటర్లు ఎక్కువగా మిస్‌ టైమ్‌ కావడం సహజమే. ఈ నేపథ్యంలో దూకుడుగా ఆడే ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తన టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో చిత్తుగా ఓడిన అయ్యర్‌కు ఈ సిరీస్‌ పెద్ద సవాల్‌గానే పరిగణించాలి. అయితే, నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. భువీ, వరుణ్‌ చక్రవర్తి రాకతో బౌలింగ్‌ మెరుగ్గా కనిపిస్తోంది. అయితే నితీశ్‌ కుమార్‌, శివమ్‌ దూబే ఏ మేరకు సహకారం అందిస్తారో చూడాలి.

సత్తాచాటాలని..: మరోవైపు న్యూజిలాండ్‌ జట్టు సొంతగడ్డపై విజృంభించే అవకాశముంది. భారీ హిట్టర్లు గ్లెన్‌ ఫిలిప్స్‌, ఫిన్‌ అలెన్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు దీటుగా చెలరేగుతారని భావిస్తున్నట్టు కివీస్‌ కెప్టెన్‌ శాంట్నర్‌ చెప్పాడు. పిచ్‌లు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉందని అన్నాడు. రచిన్‌ గాయపడడంతో కాన్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చే చాన్సుంది. జేమిసన్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. ఇరుదేశాల మధ్య వందేళ్ల క్రీడా సంబంధాల నేపథ్యంలో.. ఈ సిరీ్‌సను చిరస్మరణీయం చేసుకోవాలని భారత్‌, కివీస్‌ భావిస్తున్నాయి.

పిచ్‌/వాతావరణం

మ్యాచ్‌ ఆరంభంలో పిచ్‌ పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఆహ్లాదంగా ఉండనుంది. మంచు ప్రభా వం ఉండడంతో టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు.

జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, దూబే, నితీశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌, ప్రిన్స్‌/వరుణ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫెర్డ్‌, కాన్వే, ఫిలిప్స్‌, డారెల్‌ మిచెల్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), నాథన్‌ స్మిత్‌, కైల్‌ జేమిసన్‌, హెన్రీ, ఫెర్గూసన్‌.

ఈ వార్తలనూ చదవండి:

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - Oct 22 , 2026 | 06:27 AM