ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
ABN , Publish Date - Oct 21 , 2026 | 01:10 PM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేది కేవలం పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ అని ఆరోపించారు. మహిళలను పురుషుల ఆస్తిగా భావిస్తుందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. రాహుల్ గాంధీకి సరైన అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలు పిల్లచేష్టలను తలపిస్తున్నాయని విమర్శించారు (Rahul Gandhi about RSS).
ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తూ రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 'ఆర్ఎస్ఎస్ అనేది మహిళలను పురుషుల ఆస్తిగా భావిస్తుంది. పూర్తిగా పురుషులతో కూడిన రాజ్యాంగ వ్యతిరేక సంస్థ. నేను శివ శక్తిని నమ్ముతాను. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరో విషయం ఏమిటంటే, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన చాలా మంది మహిళలు నా పక్షాన ఉన్నారు' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు (Rahul Gandhi RSS Remark).
ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేసే ముందు ఆ సంస్థ గురించి అధ్యయనం చేయాలని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సూచించారు (BJP Reaction to Rahul comments). మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే విభాగం ఆర్ఎస్ఎస్‌కు ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు ఆ సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఉందో ముందుగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అంతేకాకుండా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎంపీ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న చర్యలపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..